ప్రేమ్‌సాగర్‌రావుపై కుట్రలు సాగవు
మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ పద్ధతి మార్చుకోవాలి: అనుచరుల హెచ్చరిక మంచిర్యాల అక్టోబర్ 6, ( ఆంజనేయులు న్యూస్ ) మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ తమ పద్ధతిని మార్చుకోవాలని, లేనిపక్షంలో మంతెన జగన్మోహన్‌రావు వర్గాన్ని కాంగ్రెస్ నుంచి బహిష్కరించేలా అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు వర్గీయులు హెచ్చరించారు. మంగళవారం ఎమ్మెల్యే నివాసంలో మేయర్ మధుకర్, మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు తూముల నరేష్, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు పూదరి తిరుపతి మీడియాతో మాట్లాడారు. ప్రేమ్‌సాగర్‌రావు చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేకే వర్గపోరుకు తెరలేపుతున్నారని...