రూ.25 వేల లంచం డిమాండ్.. రూ.3 వేలు నగదు, రూ.22 వేలు ఫోన్‌పే ద్వారా స్వీకరణ
నాగర్‌కర్నూల్ అక్టోబర్ 6, ( ఆంజనేయులు న్యూస్ )
మెడికల్ లీవ్ దరఖాస్తును ప్రాసెస్ చేయడంతో పాటు బిల్లులు, అలవెన్సులు మంజూరు చేసేందుకు రూ.25 వేల లంచం తీసుకుంటుండగా అచ్చంపేట సబ్-డివిజనల్ ట్రెజరీ కార్యాలయ సీనియర్ అకౌంటెంట్ కందాడ వెంకటయ్య ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటయ్య డిమాండ్ చేసిన లంచంలో రూ.3 వేల నగదును, మిగిలిన రూ.22 వేల మొత్తాన్ని ఫోన్‌పే ద్వారా స్వీకరిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అనంతరం వెంకటయ్యను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు పేర్కొంటూ హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.