రక్తదానానికి యువత ముందుకు రావాలి: లయన్‌ వి. మధుసూదన్‌రెడ్డి

మంచిర్యాల, సెప్టెంబర్ 28, ( ఆంజనేయులు న్యూస్ ) అక్టోబర్ 1న నిర్వహించే జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల పట్టణంలోని గోదావరి రోడ్డులో ఏకలవ్య ఆశ్రమ సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఎస్సై శిక్షణ శిబిరంలో సోమవారం రక్తదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320జీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శిక్షణ పొందుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు రక్తదానం ప్రాముఖ్యతను వివరించారు. రక్తదాన...