Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 12:21 pm Posted by : Anjaneyulu Dega

రక్తదానానికి యువత ముందుకు రావాలి: లయన్‌ వి. మధుసూదన్‌రెడ్డి

మంచిర్యాల, సెప్టెంబర్ 28, ( ఆంజనేయులు న్యూస్ )

అక్టోబర్ 1న నిర్వహించే జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల పట్టణంలోని గోదావరి రోడ్డులో ఏకలవ్య ఆశ్రమ సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఎస్సై శిక్షణ శిబిరంలో సోమవారం రక్తదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320జీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శిక్షణ పొందుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు రక్తదానం ప్రాముఖ్యతను వివరించారు. రక్తదాన శిబిరాల్లో యువత స్వచ్ఛందంగా పాల్గొని ప్రాణాపాయంలో ఉన్న వారికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. రక్తదానంపై పూర్తి సమాచారంతో రూపొందించిన కరపత్రాలను విడుదల చేసి విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులు సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా లయన్ వి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ “అన్ని దానాల్లో రక్తదానం అత్యంత ముఖ్యమైనది, పవిత్రమైనది. ఆపదలో ఉన్న మనిషి ప్రాణాలను కాపాడే అమూల్యమైన ఔషధం రక్తం. యువత ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొనాలి” అని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ పి. వెంకటేశ్వర్లు, ప్రోగ్రాం చైర్పర్సన్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి, లయన్ సభ్యులు వినయ్ కుమార్, నాగేందర్, ఏకలవ్య ఆశ్రమ నిర్వాహకులు శ్రీనివాస్, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.