మంచిర్యాల ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కడుపుకోతలు..!

మంచిర్యాల, సెప్టెంబర్ 23, ( ఆంజనేయులు న్యూస్ ) ప్రసవం కోసం ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించే పేద, మధ్యతరగతి కుటుంబాల అమాయకత్వమే కొందరికి టార్గెట్‌గా మారుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రసవం కోసం ఆస్పత్రులను ఆశ్రయించిన కొంతమంది గర్భిణీలు, వారి కుటుంబ సభ్యులు తమకు ఎదురైన అనుభవాలను వెల్లడిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “తల్లి, బిడ్డకు ప్రమాదం ఉంది.. ఆపరేషన్‌ చేయాల్సిందే” అంటూ ఆందోళనకు గురిచేస్తున్నారని కొందరు గర్భిణీలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా “ఉమ్మనీరు తగ్గింది.. పేగు మెడకు చుట్టుకుంది” అంటూ కుటుంబ సభ్యులను భయాందోళనకు గురిచేస్తున్నారని...