ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించిన సాంస్కృతిక సారథి బృందం
మంచిర్యాల సెప్టెంబర్ 23, ( ఆంజనేయులు న్యూస్ ) తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సాంస్కృతిక సారథి కళాకారులు ఆటపాటలతో కార్యక్రమం నిర్వహించారు. బుధవారం జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం సోమగూడెం గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాటలు, నృత్యాలు, ప్రదర్శనల ద్వారా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అర్హులైన పేదలకు...