సర్కారు దవాఖానాలో దారుణం: శవాన్ని పీక్కుతిన్న ఎలుకలు!
వరంగల్ సెప్టెంబర్ 20, ( ఆంజనేయులు న్యూస్ ) ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ తీరుపై తీవ్ర ప్రశ్నలు తలెత్తించేలా వర్ధన్నపేట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. మార్చురీలో భద్రపరిచిన మృతదేహాన్ని ఎలుకలు కొరికిన ఘటన కలకలం రేపింది. వరంగల్ జిల్లాకు చెందిన గారె వీరయ్య శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శవపంచనామా, పోస్టుమార్టం నిమిత్తం శనివారం రాత్రి ఆయన మృతదేహాన్ని వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం ఉదయం పోస్టుమార్టం కోసం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లగా, మృతదేహంలోని...