విద్యార్థులకు ట్రాఫిక్ పాఠాలు.. సీఐ ఎం.డి. హన్నన్ అవగాహన
మంచిర్యాల సెప్టెంబర్ 19, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల పట్టణంలోని అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎం.డి. హన్నన్ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ ఎం.డి. హన్నన్ మాట్లాడుతూ.. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలని, నిర్ణీత వేగ పరిమితిలోనే వాహనాలు నడపాలని సూచించారు. వాహనం నడుపుతున్న సమయంలో సెల్ఫోన్ వినియోగించకూడదని తెలిపారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, ట్రాఫిక్...