జ్ఞాన భారతం విజయవంతానికి కృషి చేయాలి: అదనపు కలెక్టర్‌ పి.చంద్రయ్య

మంచిర్యాల, సెప్టెంబర్‌ 17, ( ఆంజనేయులు న్యూస్ ) జిల్లాలో జ్ఞాన భారతం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అధికారులను ఆదేశించారు. నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో సంబంధిత జిల్లా స్థాయి కో-ఆర్డినేషన్‌ కమిటీ, విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రంథాలయాలు, విద్యాసంస్థలు, దేవాలయాలు, మఠాలు, పరిశోధనా సంస్థలు, వ్యక్తుల వద్ద ఉన్న పురాతన గ్రంథాలు, తాళపత్ర గ్రంథాలు, అరుదైన మాన్యుస్క్రిప్ట్‌లు, శిలాశాసనాలు,...