శాస్త్ర సదస్సులో కార్మెల్ విద్యార్థిని సత్తా.. జిల్లా స్థాయిలో ప్రథమం
రిషితకు ప్రథమ బహుమతి అందజేస్తున్న డీఎస్ఓ రాజగోపాల్, ఉపాధ్యాయులు మంచిర్యాల, సెప్టెంబర్ 17, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల జిల్లా సైన్సు కార్యాలయం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17, గురువారం జిల్లా స్థాయి శాస్త్ర సదస్సు (Science Seminar) అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 50 పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ‘2047 నాటికి భారత ఇంధన బుట్ట–అవకాశాలు, సవాళ్లు’ (Indian Energy Basket–2047: Prospects and Challenges) అనే అంశంపై నిర్వహించిన సదస్సులో కార్మెల్ కాన్వెంట్ ఉన్నత...