అటకెక్కిన చదువులు.. అయోమయంలో తల్లిదండ్రులు!

మంచిర్యాల, సెప్టెంబర్ 16, ( ఆంజనేయులు న్యూస్ ) చదువు అంటే కేవలం తరగతి పెరగడం కాదు.. అక్షరాలు చదవడం, రాయడం, విషయాన్ని అర్థం చేసుకోవడం, నేర్చుకున్నదాన్ని ఆచరణలో పెట్టగలగడం. కానీ ప్రస్తుత విద్యా విధానంలో విద్యార్థి నిజంగా నేర్చుకుంటున్నాడా? లేక సిలబస్‌ పూర్తవుతోందా? అన్నదే ప్రశ్నగా మారుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో కొంతమంది విద్యార్థులు ఉన్నత తరగతులకు చేరుతున్నప్పటికీ ప్రాథమిక చదువు, రాత నైపుణ్యాల్లో వెనుకబడుతున్నారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రాథమిక తరగతుల్లోనే విద్యార్థులు చదవడం, రాయడం...