టీకాల నిల్వలపై డీఎంహెచ్‌ఓ నరేందర్ రాథోడ్ ఫోకస్..!
మంచిర్యాల సెప్టెంబర్ 16, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల జిల్లాలో అన్ని రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. బుధవారం మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆర్‌ఎంవో డాక్టర్ కుమారస్వామితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలో అందిస్తున్న మాతా శిశు వైద్య సేవలు, టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. జిల్లాలో వ్యాక్సిన్ల కొరత లేదని, అన్ని రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయని డీఎంహెచ్‌ఓ తెలిపారు. ఏదైనా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవసరమైన...