వినాయక ఉత్సవాలకు పోలీస్‌ శాఖ మార్గదర్శకాలు: సీఐ శ్రీనివాసరావు

బెల్లంపల్లి, సెప్టెంబర్ 11, ( ఆంజనేయులు న్యూస్ ) వినాయక చవితి సందర్భంగా బెల్లంపల్లి మున్సిపల్‌ పరిధిలో గణపతి మండపాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహించాలనుకునే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్‌ శాఖకు సమాచారం అందించాలని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్‌టౌన్‌ సీఐ కే. శ్రీనివాసరావు సూచించారు. ఈ నెల 14న వినాయక చవితి నేపథ్యంలో మండపాల నిర్వాహకులు ముందుగానే తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు. విగ్రహం ఏర్పాటు చేసే ప్రదేశం, సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ పరిధి, విగ్రహం, మండపం ఎత్తు, ఉత్సవ...