మట్టి వినాయకుడితో పర్యావరణ పరిరక్షణ: కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, సెప్టెంబర్ 10, ( ఆంజనేయులు న్యూస్ ) పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. గురువారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణేశ విగ్రహాలను పంపిణీ చేసి, మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై రూపొందించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. పర్యావరణహితమైన మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా జలవనరుల కాలుష్యాన్ని నివారించవచ్చన్నారు. రసాయనిక రంగులు, ప్లాస్టర్ ఆఫ్...