తాండూరులో ఘనంగా చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి
తాండూరు, సెప్టెంబర్ 10, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమాన్ని తాండూరు మండల రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బెల్లంపల్లి నియోజకవర్గ రజక సంఘం అధ్యక్షులు పెండ్యాల శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పెండ్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. రజకుల హక్కుల కోసం, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం చిరస్మరణీయమని...