పండుగను సామరస్యంతో.. సంతోషంగా జరుపుకోవాలి: కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, సెప్టెంబర్ 9, ( ఆంజనేయులు న్యూస్ ) వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలో వేడుకలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో డీసీపీ ఎ. భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్...