పీవీటీజీలకు మెరుగైన వైద్య సేవలు: అదనపు కలెక్టర్ చంద్రయ్య

మంచిర్యాల సెప్టెంబర్ 10, ( ఆంజనేయులు న్యూస్ ) ప్రధానమంత్రి ఆదివాసి న్యాయ మహా అభియాన్‌ (పీఎం జన్మన్‌) కార్యక్రమం ద్వారా ఆదిమ గిరిజన జాతులకు మెరుగైన వైద్య, ఆరోగ్య, సంక్షేమ సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని అదనపు జిల్లా కలెక్టర్ చంద్రయ్య ఐఏఎస్ అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా కాశిపేట మండలం వెంకటాపూర్ ఆదివాసీ పీవీటీజీ గ్రామంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన సంక్షేమ శాఖ, ఐటీడీఏ ఉట్నూర్ ఆధ్వర్యంలో నిర్మించిన మల్టీపర్పస్ కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి...