తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజీ నారాయణరావు: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, సెప్టెంబర్ 9, ( ఆంజనేయులు న్యూస్ ) తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్లు పి. చంద్రయ్య, వి. రాములు తో కలిసి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ప్రతి...