కార్మెల్ సీబీఎస్‌ఈలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు

మంచిర్యాల సెప్టెంబర్ 9, ( ఆంజనేయులు న్యూస్ ) తెలంగాణ ప్రజల యాస, భాష, సంస్కృతి, జీవనశైలికి అద్దం పట్టిన మహాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని తెలంగాణ మాండలిక భాషా దినోత్సవాన్ని మంచిర్యాలలోని కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ సీబీఎస్‌ఈలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం విద్యార్థినీ, విద్యార్థులు తెలంగాణ జానపద నృత్యాలు, పాటలు, ఉపన్యాసాలతో అలరించారు. తెలంగాణ మాండలికంలోని మాధుర్యాన్ని, జానపద సంస్కృతిలోని గొప్పతనాన్ని తమ ప్రదర్శనల ద్వారా చాటిచెప్పారు. ఈ సందర్భంగా పాఠశాల...