బియ్యం లక్ష్యం త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, సెప్టెంబర్ 8, ( ఆంజనేయులు న్యూస్ ) రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యాన్ని త్వరగా మర ఆడించి, నిర్దేశిత బియ్యం లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. మంగళవారం భీమారం మండలం అంకుశాపూర్‌లోని సమతా రైస్‌మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. మద్దికల్ గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించిన కలెక్టర్.. తడి, పొడి చెత్తను ప్రతిరోజూ సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, నిబంధనల ప్రకారం...