అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమం

మంచిర్యాల సెప్టెంబర్ 8, ( ఆంజనేయులు న్యూస్ ) అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో హాజీపూర్ మండలం కొల్లంగూడ గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సేవా కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు, కార్యక్రమ చైర్‌పర్సన్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి సహాయ సహకారాలతో పాఠశాలలోని 25 మంది విద్యార్థినీ విద్యార్థులకు అవసరమైన స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్స్, స్టేషనరీ సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి శ్రీ రాజేశం హాజరయ్యారు. ఈ...