కౌమార ఆరోగ్యంపై విస్తృత అవగాహన: డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్
మంచిర్యాల, సెప్టెంబరు 8, ( ఆంజనేయులు న్యూస్ ) కౌమార బాలబాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ కార్యక్రమంలో భాగంగా 10 నుంచి 19 ఏళ్ల బాలబాలికలు, పీర్ గ్రూప్ సభ్యులకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన కరపత్రాలు, పోస్టర్లను మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య...