మంచిర్యాల సెప్టెంబర్ 7, ( ఆంజనేయులు న్యూస్ )
జిల్లాలో చేపట్టిన ఎస్ ఐ ఆర్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ యోగితా రాణా అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ లతో కలిసి ఎ.ఈ.ఆర్.ఓ.లు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్-2026 లో భాగంగా జిల్లాలో 1 లక్షా 70 వేల మ్యాపింగ్ కాని, అనమోలీస్ ఓటర్ల సంబంధిత నోటీసులు జనరేట్ చేయడం జరిగిందని, జనరేట్ చేసిన 1 లక్షా 10 వేల నోటీసులు పంపిణీ చేసి, మిగిలిన 60 వేల నోటీసులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. జిల్లాలో 3 ఈ.ఆర్.ఓ. లు, 18 ఎ.ఈ.ఆర్.ఓ.లు, అదనంగా కేటాయించబడిన 18 ఎ.ఈ.ఆర్.ఓ.లు ఎస్ ఐ ఆర్ సంబంధిత క్లెయిమ్స్ & అబ్జెక్షన్ ప్రక్రియపై పని చేస్తున్నారని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు 18 సంవత్సరాలు నిండి ఓటు హక్కుకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని, నోటీసులు జారీ అయిన ప్రతి ఒక్కరు సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించేలా వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. భారత ఎన్నికల సంఘంచే జారీ చేయబడిన 11 డాక్యుమెంట్లలో నుంచి మాత్రమే సంబంధిత ఓటర్లు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని, బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లకు నోటీసుల జారీ, సంబంధిత డాక్యుమెంట్ల సమర్పణ తదితర అంశాలపై మరొకసారి శిక్షణ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నో మ్యాపింగ్, అనమోలీస్, ఎ.ఎస్.డి. జాబితాను సంబంధిత బూత్ స్థాయి ఏజెంట్లకు అందించాలని, బూత్ స్థాయి అధికారులు నోటీసులు జారీ అయిన ఓటర్లు సమర్పించాల్సిన డాక్యుమెంట్లపై వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. అర్హత కలిగిన ఏ ఒక్కరూ కూడా ఓటు హక్కును కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ లతో కలిసి ఎ ఈ ఆర్ ఓ లు, అదనపు ఎ ఈ ఆర్ ఓ లతో ఎస్ ఐ ఆర్- 2026 ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. బూత్ స్థాయి అధికారులకు, సూపర్వైజర్ లకు నియమ నిబంధనలపై శిక్షణ నిర్వహించాలని తెలిపారు. నో మ్యాపింగ్, అనమోలీస్, ఎ ఎస్ డి జాబితాను సంబంధిత రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేయాలని తెలిపారు. ఎస్ ఐ ఆర్ కు ప్రతిరోజు కొంత సమయం ప్రత్యేకంగా కేటాయించాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కమ్యూనిటీ సర్టిఫికెట్ నిబంధనలను అనుసరించి త్వరితగతిన జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంతకుముందు జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో గల సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ యోగితా రాణా ను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు), ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ లతో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అనంతరం నస్పూర్ లో గల 250, 251, 252, 253 పోలింగ్ కేంద్రాలను సందర్శించి సంబంధిత బూత్ స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.