ఎన్‌హెచ్‌–63 బాధిత రైతుల ధర్నా

మంచిర్యాల, సెప్టెంబర్ 7, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎన్‌హెచ్‌–63 బాధిత హాజీపూర్, లక్షెట్టిపేట మండలాల రైతులు ధర్నా నిర్వహించారు. తమ భూములకు సంబంధించిన కేసులు న్యాయస్థానాల పరిధిలో విచారణలో ఉండగానే రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. అనంతరం నోటీసుల ప్రతులను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు తుల మధుసూదన్ రావు, రైతులు మాట్లాడుతూ.. 2023లో నేషనల్ హైవే...