హియరింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలి: డా. యోగితా రాణా

ఆసిఫాబాద్, సెప్టెంబర్ 7, ( ఆంజనేయులు న్యూస్ ) ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా నిర్వహిస్తున్న హియరింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని ప్రత్యేక ఓటరు సవరణ పరిశీలకురాలు, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డా. యోగితా రాణా కోరారు. అర్హులైన ఏ ఒక్కరి పేరు ఓటరు జాబితా నుంచి తొలగకుండా, అనర్హుల పేర్లు జాబితాలో ఉండకుండా ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ...