మంచిర్యాల, సెప్టెంబర్ 3, ( ఆంజనేయులు న్యూస్ )
నిరుపేదలను గుర్తించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మంచిర్యాల వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో వాసవి వారోత్సవాలు బుధవారం రాత్రి వైశ్య భవన్‌లో ఘనంగా నిర్వహించారు. వాసవి క్లబ్ అంతర్జాతీయ సంస్థ పిలుపుమేరకు సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు వివిధ సేవా కార్యక్రమాలను వారోత్సవాలుగా నిర్వహిస్తున్నారు. వారోత్సవాల్లో భాగంగా వాసవి క్లబ్ అంతర్జాతీయ సంస్థ నిర్వహిస్తున్న సరస్వతి పథకానికి సహకరిస్తున్న సిల్వర్ స్టార్, గోల్డెన్ స్టార్, క్రౌన్ స్టార్ దాతలను గుర్తించి ఘనంగా సత్కరించారు. విద్యారంగంలో విశేష సేవలు అందిస్తున్న పలువురు ఉపాధ్యాయులను సన్మానించారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలుస్తూ సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న పాత్రికేయులను సైతం ఘనంగా సత్కరించారు. వాసవి క్లబ్‌ల సేవా కార్యక్రమాలకు అండగా నిలిచి సహకరిస్తున్న గురువులను కూడా ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు సిరిపురం రాజేష్, ముక్తా శ్రీనివాస్, కటకం హరీష్, జిల్లా గవర్నర్ పుల్లూరి బాలమోహన్ మాట్లాడుతూ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు తెలిపారు. సరస్వతి పథకం ద్వారా నిరుపేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు, స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సమాజంలోని పేదలు, విద్యార్థులకు అండగా నిలవడమే వాసవి క్లబ్‌ల ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల వాసవి క్లబ్ అధ్యక్షుడు వెనిశెట్టి రాఘవేంద్ర, కార్యదర్శి గుండా మనోహర్, కోశాధికారి బండ శ్రీనివాస్, వనిత క్లబ్ అధ్యక్షురాలు ముక్త యామిని, కోశాధికారి వెలిశెట్టి దివ్య, క్యాబినెట్ సెక్రెటరీ కేశేట్టి వంశీకృష్ణ, కోశాధికారి కుంకుమొట్టి వెంకటేశ్వర్లు, పీఆర్వో ఉత్తురి రమేష్, రీజియన్ చైర్‌పర్సన్ సిద్ధంశెట్టి మధుశ్రీ, జోన్ చైర్‌పర్సన్ ఇరుకుల్ల సూర్యనారాయణ, కాచం మల్లికార్జున్, అంతర్జాతీయ ప్రోగ్రాం కోఆర్డినేటర్ అక్కినపల్లి రవీందర్, జిల్లా అధికారులు ఇరుకుల్ల శ్రీనివాస్, కాసం సతీష్, కొత్త సురేందర్, నాలుమాసు లావణ్య, దైద సరిత, మల్యాల సంగీత తదితరులు పాల్గొన్నారు.