మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం.. రోడ్లపై చెత్త
మంచిర్యాల, ఆగస్టు 27, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన మున్సిపల్ పారిశుద్ధ్య విభాగం నిర్లక్ష్యంపై పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన చెత్తను డంపింగ్యార్డుకు తరలించే వాహనాలు సరైన రక్షణ చర్యలు లేకుండా రోడ్లపై ప్రయాణిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెత్త తరలింపు వాహనాలకు వెనుక భాగంలో సరైన మూతలు, రక్షణ వలలు లేకపోవడంతో వాహనాలు వేగంగా వెళ్లే సమయంలో చెత్త, ప్లాస్టిక్ కవర్లు, ఇతర వ్యర్థాలు రోడ్లపై పడిపోతున్నాయి. దీంతో ప్రధాన రహదారులపై...