రక్తదానంతో సేవా స్ఫూర్తిని చాటిన ఫోటోగ్రాఫర్లు
మంచిర్యాల, ఆగస్టు 25, ( ఆంజనేయులు న్యూస్ ) ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియో గ్రాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహాయ సహకారాలతో నిర్వహించిన ఈ శిబిరంలో మంచిర్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 105 మంది ఫోటోగ్రాఫర్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవా స్ఫూర్తిని చాటారు. ఈ సందర్భంగా మంగళవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ...