నేత్రదానంతో చూపులేని వారి జీవితాల్లో వెలుగులు

మంచిర్యాల, ఆగస్టు 25, ( ఆంజనేయులు న్యూస్ ) నేత్రదానం ఆవశ్యకత, ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ, లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నేత్రదాన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు జిల్లావ్యాప్తంగా నేత్రదానం, దాని ప్రాముఖ్యతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా అంధత్వ నివారణ...