రాముని చెరువులో అవకతవకలపై లోకాయుక్త పోలీసుల విచారణ
మంచిర్యాల, ఆగస్టు 24, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల పట్టణంలోని రాముని చెరువులో జరుగుతున్న అవకతవకలపై గతంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు తుల మధుసూదన్ రావు తెలంగాణ లోకాయుక్తకు చేసిన ఫిర్యాదు మేరకు సోమవారం లోకాయుక్త పోలీసు అధికారులు చెరువును సందర్శించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఫిర్యాదు విచారణలో భాగంగా విచారణ అధికారి వసంశెట్టి వెంకటరమణమూర్తి రాముని చెరువును పరిశీలించారు. చెరువులో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలు, మత్తడి కూల్చివేతలు, చెరువు మధ్య నుంచి నిర్మించిన రోడ్డు, అక్రమంగా ఏర్పాటు...