సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా శిశు మందిరాల విద్యా విధానం

మంచిర్యాల, ఆగస్టు 22, ( ఆంజనేయులు న్యూస్ ) సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ చిన్ననాటి నుంచే విద్యార్థులను సమగ్రంగా తీర్చిదిద్దుతున్న సరస్వతి శిశు మందిరాల విద్యా విధానం భావి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల మున్సిపల్ మేయర్ ధరణి మధుకర్ అన్నారు. శనివారం మంచిర్యాల సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో నిర్వహించిన శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ విభాగ్ స్థాయి గణిత విజ్ఞాన సంస్కృతి మహోత్సవం కార్యక్రమానికి వారు...