Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 1:54 pm Posted by : Anjaneyulu Dega

రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం.. కాంగ్రెస్ శ్రేణుల ఘన నివాళులు

మంచిర్యాల, ఆగస్టు 20, ( ఆంజనేయులు న్యూస్ )

భారత మాజీ ప్రధానమంత్రి, స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సీసీసీ కార్నర్ చౌరస్తా వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ అభివృద్ధికి, ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు. ముఖ్యంగా యువత, సాంకేతిక రంగం, సమాచార సాంకేతికత అభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, టీపీసీసీ సభ్యులు, నస్పూర్ పట్టణ ఇన్‌చార్జి నూకల రమేష్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.