రూపారెడ్డి హత్యకు నిరసనగా మంచిర్యాలలో క్యాండిల్ ర్యాలీ
మంచిర్యాల, ఆగస్టు 20, ( ఆంజనేయులు న్యూస్ ) నల్గొండ జిల్లాలో ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ మంచిర్యాల ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ప్రతినిధులు, ఉపాధ్యాయులు క్యాండిల్స్ చేతబట్టి జిల్లా కేంద్రంలో ర్యాలీ చేపట్టారు. క్యాండిల్ ర్యాలీ ఐబీ కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకోగా, అక్కడ రూపారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి...