ప్రమాదాలు జరుగుతున్నా.. గేదెల సమస్యపై అధికారుల మౌనం!
పట్టపగలు.. నడిరాత్రి.. రోడ్డుపైనే గేదెలు! మంచిర్యాల, ఆగస్టు 18, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల జిల్లా కేంద్రంలో రోడ్లపై పగలు, రాత్రి గేదెల సంచారం వాహనదారులు, కాలనీవాసులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. హమాలీవాడ అండర్‌బ్రిడ్జి నుంచి సూర్యనగర్ వరకు కనీసం మూడు, నాలుగు ప్రాంతాల్లో గేదెలు రోడ్లపైనే సంచరిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై గేదెలు అడ్డంగా రావడంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి పడిపోతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. చిన్నా, పెద్దా ప్రమాదాలు...