గ్రీన్ సిటీలో అక్రమ షెడ్లపై అధికారుల ద్వంద్వ వైఖరి!

టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం మంచిర్యాల, ఆగస్టు 14 ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల పట్టణంలోని గ్రీన్ సిటీ కాలనీలో అక్రమ షెడ్ల నిర్మాణాలపై మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో రోడ్లను ఆక్రమిస్తూ పలు ఇనుప షెడ్లు నిర్మించినా మూడు నెలలుగా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో ఓ నిరుపేద వ్యక్తి ఏర్పాటు చేసుకున్న చిన్న షెడ్డును మాత్రం అధికారులు వెంటనే కూల్చివేయడం విమర్శలకు దారితీసింది. గ్రీన్...