మందమర్రి, ఆగస్టు 15, ( ఆంజనేయులు న్యూస్ )
మంచిర్యాల జిల్లా, మందమర్రిలో నూతనంగా “కళ్యాణిఖని ప్రెస్ క్లబ్” ఏర్పాటు చేశారు. జర్నలిస్టుల ఐక్యత, వృత్తిపరమైన సహకారం, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా క్లబ్‌ను ఏర్పాటు చేసినట్లు నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్ అధ్యక్షుడిగా పార్వతి రాజేష్ కుమార్, జనరల్ సెక్రటరీగా రామ్ వేణు, ట్రెజరర్‌గా తెల్ల విజయ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొమ్ము రాజేష్, గౌరవ సలహాదారుగా కనపర్తి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే వైస్ ప్రెసిడెంట్లుగా మదాసు కుమార్, గరిగే సుమన్, ఎగుడ రాయమల్లు, జాయింట్ సెక్రటరీలుగా మాసు రాకేశ్, కంది రాజేశం, కాగితపు శ్రీనివాస్, లీగల్ అడ్వైజర్‌గా అడిచెర్ల నాగేందర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా జీవన్ కుమార్, పీఆర్‌ఓ క్లబ్ ఇన్‌చార్జిగా బీరం రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. కళ్యాణిఖని ప్రెస్ క్లబ్‌ను జర్నలిస్టుల ఐక్యతకు వేదికగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని తెలిపారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేస్తామని, వృత్తి విలువలను కాపాడుతూ క్లబ్‌ను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. నూతన కార్యవర్గం ఏర్పాటు కావడంతో జర్నలిస్టులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు.