క్షయ వ్యాధిగ్రస్తులకు లైన్స్ క్లబ్ చేయూత

మంచిర్యాల, ఆగస్టు 14, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌నగర్‌లోని లైన్స్ క్లబ్ ఆడిటోరియంలో క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంచిర్యాల మండలానికి చెందిన 25 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం అందించేందుకు మంచిర్యాల లైన్స్ క్లబ్ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. క్షయ వ్యాధి నిర్మూలనలో మందులతో పాటు...