గిరిజన గ్రామాల్లో ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా

మంచిర్యాల ఆగస్టు 14, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని నాగారం గ్రామంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకులు మున్నా రాజా సిసోడియా, తుల మధుసూదన్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేయాలనే సంకల్పంతో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు....