ఎన్నికల మేనిఫెస్టోలోని బీసీ హామీలను అమలు చేయాలి
మంచిర్యాల, ఆగస్టు 14, ( ఆంజనేయులు న్యూస్ ) కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం సైకిల్ యాత్ర నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా నుంచి హాజీపూర్ మండల కేంద్రం వరకు ఈ యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన బీసీ...