క్షయ వ్యాధిగ్రస్తులకు ఉచిత పౌష్టికాహార కిట్లు

బెల్లంపల్లి, ఆగస్టు 13, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. లయన్స్ క్లబ్ బెల్లంపల్లి సహకారంతో 15 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఉచిత పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ.. క్షయ వ్యాధి నిర్మూలనలో పౌష్టికాహారం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. జిల్లాలోని క్షయ వ్యాధిగ్రస్తులకు ఎన్జీవోలు, దాతల సహకారంతో...