అవయవ దానం మహాదానం.. మరో ఎనిమిది మందికి పునర్జన్మ

మంచిర్యాల, ఆగస్టు 13, ( ఆంజనేయులు న్యూస్ ) ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకొని లైన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో గురువారం ప్రజలకు అవయవ దానంపై అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమ చైర్మన్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో అవయవ దాన ప్రాముఖ్యతను వివరిస్తూ కరపత్రాలు, వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా లయన్ వి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ “అవయవ దానం మహాదానం” అని పేర్కొన్నారు. బ్రెయిన్ డెడ్ లేదా నిర్దిష్ట వైద్య పరిస్థితుల్లో మరణించిన వ్యక్తుల...