టిఫిన్ సెంటర్‌లో పరిశుభ్రతపై ప్రశ్నలు!
హాట్ వాటర్ ఎక్కడ..? స్పూన్లు బౌల్‌లోనే! ఫొటోలో స్పష్టమైన దృశ్యం.. తనిఖీలు చేయాలంటున్న భోజన ప్రియులు మంచిర్యాల, ఆగస్టు 9, ( ఆంజనేయులు న్యూస్ ) జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా సమీపంలో ఇందు బార్ పక్కన నిర్వహిస్తున్న ఓ టిఫిన్ సెంటర్‌లో పరిశుభ్రత ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వినియోగదారులు ఉపయోగించే స్పూన్లను శుభ్రపరిచే విషయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్పూన్లను పెద్ద సంఖ్యలో ఓ సాధారణ బౌల్‌లో ఉంచిన దృశ్యం కనిపించడంతో భోజన ప్రియులు ఆందోళన వ్యక్తం...