ప్రజలకు చేరువగా పోలీస్ శాఖ
గౌతమ్ నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిజామాబాద్, ఆగస్టు 8, ( ఆంజనేయులు న్యూస్ ) నిజామాబాద్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమ్ నగర్లో శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. గౌరవనీయులైన సీపీ ఆదేశాల మేరకు, ఏసీపీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ప్రజలకు, పోలీసులకు మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకాన్ని పెంపొందించడం, కాలనీ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం, నేరాల...