తప్పుడు జనన ధృవీకరణ పత్రం జారీ చేసిన కార్యదర్శి సస్పెండ్

కలెక్టర్ కె. హరిత ఆదేశాలతో చర్యలు ఆసిఫాబాద్, ఆగస్టు 7, ( ఆంజనేయులు న్యూస్ ) ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (టి) మండలం సిర్పూర్ (టి) గ్రామపంచాయతీలో తప్పుడు జనన ధృవీకరణ పత్రం జారీ చేసినట్లు నిర్ధారణ కావడంతో పంచాయితీ కార్యదర్శి సస్పెండ్ చేస్తూ కంప్యూటర్ ఆపరేటర్ ను విధుల నుండి తొలగించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె.హరిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విచారణలో జనన మరణాల నమోదు చట్టం, 1969 నిబంధనలను ఉల్లంఘిస్తూ గ్రామపంచాయతీ కార్యదర్శి షైనీ తిరుపతి విధి నిర్వహణలో...