మంచిర్యాలలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు – 200 మంది గర్భిణీలకు పండ్లు, బ్రెడ్ పంపిణీ
మంచిర్యాల, ఆగస్టు 4, ( ఆంజనేయులు న్యూస్ )
లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ (DMHO), ఐసీడీఎస్ సంయుక్తంగా మాతా శిశు కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) డా. నరేంద్ర రాథోడ్ హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంసీహెచ్ & జీజీహెచ్ సూపరింటెండెంట్ ఇన్‌చార్జి డా. అశోక్ కుమార్, ఆర్‌ఎంఓ డా. శ్రీధర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డా. సుధాకర్ నాయక్, జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారి రావు ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించి, పుట్టిన శిశువుకు తొలి ఆరు నెలలు తల్లిపాలే సంపూర్ణ ఆహారమని, తల్లి–బిడ్డ ఆరోగ్యానికి అవి ఎంతో అవసరమని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు లయన్స్ క్లబ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా రూపొందించిన తల్లిపాల ప్రాముఖ్యతపై వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో 200 మంది గర్భిణీ స్త్రీలకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షుడు లయన్ పి. వెంకటేశ్వర్లు, ప్రోగ్రాం చైర్‌పర్సన్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి, జోన్ చైర్‌పర్సన్ లయన్ దొంతుల ముఖేష్, కార్యదర్శి లయన్ తవటం శ్రీనివాస్, ట్రెజరర్ లయన్ పి. వెంకటేశ్వరరావు, సీనియర్ సభ్యులు లయన్ ఎం. రామాంజనేయులు, లయన్ డేగ బాబు, లయన్ ఎస్. నాగేందర్, హెల్త్ సూపర్వైజర్లు అల్లాడి శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ సూపర్వైజర్ జ్యోతి, ఆస్పత్రి సిబ్బంది, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.