మంచిర్యాలను వణికిస్తున్న వీధికుక్కలు..!

పార్కులో ఆడుకుంటున్న చిన్నారిపై విచక్షణారహిత దాడి కుక్కల నియంత్రణలో మున్సిపల్ యంత్రాంగం విఫలం.. ప్రజల్లో తీవ్ర ఆందోళన మంచిర్యాల, ఆగస్టు 3, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల పట్టణంలో వీధికుక్కల బెడద రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఆదివారం ఉదయం హైటెక్ సిటీ ఓపెన్ జిమ్ పార్క్‌లో ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధికుక్కలు విచక్షణారహితంగా దాడి చేయడంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి కుక్కలను తరిమికొట్టి చిన్నారిని రక్షించారు. అనంతరం ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించినట్లు...