Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 5:52 am Posted by : Anjaneyulu Dega

అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ యజమాని ఫిర్యాదు.. ముగ్గురిపై కేసు నమోదు

రూ.3 లక్షలు డిమాండ్ చేసి బెదిరించారన్న ఆరోపణ 

ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన మంచిర్యాల పోలీసులు

మంచిర్యాల, జూలై 30, ( ఆంజనేయులు న్యూస్ )

అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని గుర్రాల శ్రీధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితుడి ఫిర్యాదు ప్రకారం, గత కొన్ని రోజులుగా తమ సంస్థపై అసత్య ప్రచారం చేస్తామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు. జూన్ 29, 2026న సంస్థ కార్యాలయానికి వచ్చి రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, అనంతరం రూ.50,000 నగదు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మిగిలిన డబ్బుల కోసం వాట్సాప్ సందేశాలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారని కూడా ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వాట్సాప్ సందేశాలు, కాల్ రికార్డులు, వీడియోలు, సోషల్ మీడియా పోస్టుల స్క్రీన్‌షాట్లు తదితర ఆధారాలను పోలీసులకు సమర్పించినట్లు గుర్రాల శ్రీధర్ తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. తమ సంస్థపై తప్పుడు ప్రచారం చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరారు. గతంలో కూడా కొందరు వ్యక్తులు సంస్థను లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు.