ఆల్ఫోర్స్ కళాశాల భవన భద్రతపై తల్లిదండ్రుల తీవ్ర ఆందోళన
చిన్న వర్షానికే కళాశాలకు సెలవు..! భవనానికి అనుమతులు లేవనే ఆరోపణలు మున్సిపల్, టౌన్ ప్లానింగ్, విద్యాశాఖ అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టాలని డిమాండ్ మంచిర్యాల, జూలై 29, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో చిన్నపాటి వర్షానికే వర్షపు నీరు భవనంలోకి చేరడంతో బుధవారం కళాశాల యాజమాన్యం సెలవు ప్రకటించింది. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి నెలకొంటోందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత భవనంలో కళాశాల కొనసాగుతుండటంతో విద్యార్థుల భద్రతపై తీవ్ర...