మండల అధికారులతో జిల్లా పంచాయతీ అధికారి సమీక్ష సమావేశం
తాండూర్, జూలై 28, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి, మరియు బెల్లంపల్లి నియోజకవర్గ ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్ రావు అధ్యక్షతన మండల స్థాయి అధికారులు, గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఎఫ్ఏలతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో VB-GRAM G, SWM Rules–2026 అమలు, తెలంగాణ జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతలు, పంట కుంటలు, ఊట కుంటల ఏర్పాటు, గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (GPDP) తయారీ, గ్రామ అవసరాల గుర్తింపు, ప్రాధాన్యతా క్రమంలో...