Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 6:04 pm Posted by : Anjaneyulu Dega

మండల అధికారులతో జిల్లా పంచాయతీ అధికారి సమీక్ష సమావేశం

తాండూర్, జూలై 28, ( ఆంజనేయులు న్యూస్ )

మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి, మరియు బెల్లంపల్లి నియోజకవర్గ ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్ రావు అధ్యక్షతన మండల స్థాయి అధికారులు, గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఎఫ్‌ఏలతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో VB-GRAM G, SWM Rules–2026 అమలు, తెలంగాణ జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతలు, పంట కుంటలు, ఊట కుంటల ఏర్పాటు, గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (GPDP) తయారీ, గ్రామ అవసరాల గుర్తింపు, ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనుల ఎంపిక తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే, GPDP గ్రామసభలను తప్పనిసరిగా నిర్వహించి, గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసి, సంబంధిత వివరాలను e-GramSwaraj పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి అంజయ్య, ఎంపీడీవో శ్రీనివాస్, డీఎల్‌పీఓ సతీష్, ఎంఫీఓ జి. అనిల్ కుమార్, ఏఈ (పీఆర్) సాయిలత, ఏఈ (ఆర్‌డబ్ల్యూఎస్) మనోహర్, ఏపీఓ సత్యనారాయణ, ఏపీఎం, డిప్యూటీ ఎఫ్‌ఆర్‌ఓ, పశువైద్య అధికారి, తాండూరు, రేచిని ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, ఎంఏఓతో పాటు ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.